ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు
బాన్సువాడ , బతుకమ్మ : గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కువగానే ధాన్యం సేకరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తన ఇంట్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్లపై అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని,ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. సకాలంలో నియోజకవర్గ రైతాంగానికి...