Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 June 2025, 7:48 pm Posted by : ramakrishna

అసత్య ఆరోపణలను మానుకోవాలి

  • రాజకీయ అజ్ఞాని సునీల్ కుమార్
  • కమ్మర్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్ దేవేందర్

 

వేల్పూర్, బతుకమ్మ : బాల్కొండ కానిస్టెన్సీలోని సొసైటీలు, బాకీలు, బకాయిలపై బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని కమ్మర్ పల్లి మండల బీయర్ యస్ పార్టీ ప్రెసిడెంట్, సొసైటీ చైర్మన్ దేవేందర్ హితవు పలికారు. మీడియా సమావేశంలో బాల్కొండ కానిస్టేన్సీలోని సొసైటీల పై, వడ్ల కొనుగోలు కడ్తా పై, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై సునీల్ కుమార్ చేసి అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్ యస్ కార్యాలయంలో నిర్వహించిన కానిస్టెన్సీ సొసైటీ చైర్మన్ల ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాజకీయ పరిజ్ఞానం, వ్యవస్థలోని రంగాలపై అవగాహన లేని సునీల్ ఇష్టరీతి మాట్లాడం ఆయన రాజకీయ ఆజ్ఞనానికి తార్కణమని ఏద్దేవా చేశారు. కానిస్టెన్సీలోని సొసైటీల ఆర్ధిక పరిస్థితి బీయర్ యస్ పాలన కంటే ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎలా ఉండేనో, మేము ఏ పరిస్థితులల్లో ఛార్జ్ తీసుకున్నామో ఆయన ఒక్కసారి తెలుసుకోవాలని సవాల్ విసిరారు. కానిస్టెన్సీలో సొసైటీలన్ని ఏ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యం అయ్యాయో తెలుసుకొని విమర్శించాలని అన్నారు. గత బీయర్ యస్ ప్రభుత్వం రాక ముందున్న బాకీలు, బకాయిలు, బీయర్ యస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడున్న బాకీలు, బకాయిలను పరిశీలించి చూసి మాట్లాడాలన్నారు.గత రెండు సంవత్సరాలుగా నాట్ల సీజన్ రాగానే, యూరియా కొరతను ఆదిగమించలేక సొసైటీ చైర్మన్ల పైన, ఎమ్మెల్యే పైన ఏడవడం ఆయనకు పరిపాఠాయిందని ఆయన అన్నారు. అజ్ఞానం తో అవివేకం తో నోటికి వచ్చినట్లు మాట్లాడం సబబుకాదాన్నారు. మీ సొంత గ్రామం సావెల్ సొసైటీలోఈ యేడు కడ్తా ఎంత పోయిందో రైతులను తెలుసుకోవాలని అన్నారు. దాన్యం కొనుగోలులో చైర్మన్లు జేబుల్లోకి, ఎమ్మెల్యే జేబుల్లోకి కడ్తా డబ్బులు వెళ్తున్నాయని మాట్లాడిన సునీల్ కుమార్ అధికారంలో ఉన్నది బీయర్ యస్ కాదని కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం మరిచిపోయారన్నారు. గత పదేండ్లు కడ్తాతో దోచుకున్న సొమ్ము చైర్మన్ల, ఎమ్మెల్యే జేబులోకి పోతే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల అవుతుంది ఈ రెండు సంవత్సరాల కడ్తా ఎవరి జేబుల్లోకి పోయిందో రైతులకు నువ్వే చెప్పాలని ఆయన అన్నారు.మీ ప్రభుత్వం వచ్చాక రైతులు యూరియా కోసం పడుతున్న తిప్పలు అంతా ఇంతా కాదని, బకాయిలు ఉండడం మూలన యూరియా ఇస్తలేరు అంటే బీయర్ యస్ ప్రభుత్వంలో యూరియా ఎట్లా ఇచ్చారు, ఎట్లా సవ్యంగా పంపిణి చేశారో నివ్వే చెప్పాలన్నారు. రైతులకు సేవ చేయాలనే ఆలోచన లేని నువ్వు చైర్మన్లు, ఎమ్మెల్యే ను దూషిస్తే రైతులే నీకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సేవ చేయాలనే ఆలోచన ఉన్న మా నాయకుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 2020 కరోనా విపత్కర సమయంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవాలని ఆయన సూచించారు. నాయకుడు అంటే కానిస్టెన్సీ రైతుల కష్టలపై దృష్టి పెట్టి సేవ చేసేవాడని, సేవ చేసే వాళ్లపై తప్పుడు ఆరోపణలు చేసే వాడు కాదన్నారు.రైతులకు సేవ చేయాలనే ఆలోచన నీకుంటే యూరియా కోసం వరుసలో రోజంతా నిలుచుంటున్న రైతుల కష్టాలను తీర్చాలని, అవసరానికి సరిపడా యూరియాను కానిస్టెన్సీకి తెప్పించాలని ఆయన అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో రామన్నపేట సొసైటీ చైర్మన్ జాగిరపు మోహన్ రెడ్డి, మోర్తాడ్ చైర్మన్ అశోక్ రెడ్డి, మోతె చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, పడిగేలా చైర్మన్ యాళ్ల హన్మంత్ రెడ్డి, బీయర్ యస్ మండల నాయకులు రేగుల్లా రాములు, డోళ్ళ రాజేశ్వర్,రమేష్, బబ్బుర్ ప్రతాప్ రెడ్డి, రామన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.