. . . ధ్వంసమైన వాహనాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ రోడ్డులోని ఒక చెట్టు ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. చెట్టు కూలిపోయే సమయంలో కారు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.