డిచ్ పల్లి, బతుకమ్మ :
డిచ్ పల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్మూర్ వెళ్లే దారిలో రెయిన్బో హౌసెస్ సమీపంలో నడిరోడ్డు పై చెట్టు కూలింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. రహదారిపై చెట్టు కూలడంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరూ లేని సమయంలో చెట్టు కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు పైన కూలిన చెట్టును తోలిగించాలని స్థానికులు కోరుతున్నారు.