Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 6:02 pm Posted by : ramakrishna

వృద్దురాలిని దోచిన నకిలీ పోలీసులు

 

 బోధన్, బతుకమ్మ:

పోలీసులమని నమ్మించి వృద్దురాలిని ఇద్దరు అగంతకులు దోచేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శివారులోని బైపాస్ రోడ్డులో జరిగింది.బోధన్ మండలం సాలంపాడ్ చెందిన తిరుపతమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి టీవీఎస్ మోపెడ్ పై బోధన్ లోని ఆసుపత్రికి వెళ్తున్నారు. పట్టణ శివారులోని బైపాస్ రోడ్ లో ని దాబా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వృద్ధురాలు, మహిళ వెలుతున్న వాహనాన్ని ఆపి వేశారు. తాము పోలీసులమని బంగారం వేసుకుని రాకూడదని బైపాస్ కు దొంగలు సంచారం ఉంది దారిదోపిడికి పాల్పడుతున్నారని నమ్మించారు.  వృద్ధురాలి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారం చైన్, 6 తులాల బంగారు గాజులు ,పర్సు ఇస్తే కవర్ లో పెట్టి జాగ్రత్త పరుస్తామని మహిళల ను నమ్మించారు. తిరుపతమ్మ తన ఒంటి మీద ఉన్న నగలు, నగదు ఉన్న పర్సును ఇవ్వగా మహిళలకు ఖాళీ కవర్ ను మడత పెట్టి ఇచ్చిఅందులోనే బంగారు నగలు, నగదు ఉంది అక్కడ నుంచి ఉడాయించారు. తిరుపతమ్మ ఆసుపత్రికి చేరుకున్న  కవర్ ను గమనించగా పర్స్ తో పాటు అందులో ఉన్న బంగారు ఆభరణాలు, రూ 2వేల నగదు సైతం కనిపించకపోవడంతో వృద్ధురాలు అక్కడ కుప్పకూలి పడిపోయింది. వెంటనే బోధన్ పట్టణ పోలీసులు సమాచారం అందించగా ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ పోలీసులు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.