Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 11:34 am Posted by : ramakrishna

గుమాస్తా ను కిడ్నాప్ చేసి లక్షలు దోచిన నకిలీ పోలీసులు

. . . డిజీపి పర్యటన సమయంలో నగరంలో ఘటన

. . . మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

. . . కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

బంగారం వ్యాపారి వద్ద పనిచేసే గుమాస్తాను పోలీసులమని  కిడ్నాప్ చేసి నగదు ను దోచేసింది నలుగురు సభ్యుల ముఠా. సినిమా పక్కిలో నిజామాబాద్ లో గుమాస్తా ను కిడ్నాప్ చేసి 19,92,000 నగదును కొట్టేసి , అతడిని బాసరలో వదిలి పరారీ అయ్యారు.. క్రైమ్ సస్పెన్షన్ కు మారు పేరుగా ఈ ఘటన ఈ నెల 23( శుక్రవారం) నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్  లిమిట్స్ లో నాలుగు గంటల వ్యవధిలో జరిగింది. నగరంలోని గుర్బబాది రోడ్ కు చెందిన అనిల్ పాటిల్ చిద్రవార్ కు గాంధీ గంజ్ లో శ్రీ వేంకటేశ్వర గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ పేరుతో బంగారం, వెండి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతని వద్ద నాందేడ్ కు చెందిన గంగాధర్ పది సంవత్సరాలుగా గుమాస్తాగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అనిల్ తన ఆర్టిజిఎస్ ద్వార డబ్బులు పేమెంట్ చేస్తే సొత్తు ( బంగారం, వెండి)ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తీసుకురావడం గంగాధర్ పని.

 

ఈనెల 23న అనిల్ వ్యాపారం నిమిత్తం మెట్ పల్లి వేళుతూ.. ఇంట్లో నగదును నాందేవ్ వాడ ఐసిఐసిఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని చెప్పారు. శుక్రవారం ఉదయం గంగాధర్ తన యజమాని ఇంటికి వెళ్లగా అక్కడ యజమాని సతిమణి స్వరుపరాణి బ్యాంకు లో డిపాజిట్ చేయమని రూ.19,92,000 నగదు కట్టలు కలిగిన బ్యాగ్ ను అప్పగించింది. అతను బ్యాంక్ కు నడుచుకుంటూ వెళ్ళేసరికి అది మూసి ఉండటంతో, డబ్బులు షాప్ కి తీసుకువెళుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తాము పోలీసులమని కారులో వచ్చి నాందేవ్ వాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని తెలిపారు. అతడిని శివాజీ చౌక్ మీదుగా బాసర వద్దకు తీసుకు వెళ్లి రూ.1,000 చేతిలో పెట్టి నడిరోడ్డు మీద వదిలి వెళ్లినట్టు ఈ మేరకు మునీం గంగాధర్ వచ్చి యజమాని భార్యకు  సమాచారం ఇవ్వడం ఆమె ఫోన్ లో వ్యాపారి అనిల్ కు తెలుపడంతో స్థానికంగా మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 

 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  విచారణ చేపట్టారు. బాధితుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం విచారణ చేపట్టిన స్థానికంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అసలు పోలీసుల పేరు చెప్పి గుమాస్తా కిడ్నాప్ జరిగిందా, నగదు చోరీ జరిగిందా  లేక కట్టుకథలు అల్లా రా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీస్ బాస్ జిల్లా కేంద్రంలో పర్యటన జరుపుతున్నప్పుడు పోలీసుల పేరు నకిలీలు దోచుకోవడం కలకలం రేపుతోంది.