Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 10:45 am Posted by : ramakrishna

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

 

. . . వారం రోజుల వ్యవధిలో రెండో ఘటన

నిజామాబాద్ క్రైం , బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎటిఎంలో దొంగతనానికి విఫలయత్నం జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఖలీల్ వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం లో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరి కి యత్నించి విఫలమయ్యారు. అదే మాదిరిగా బాల్కొండ నియోజకవర్గంలో  జాతీయ రహదారిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈనెల 27న తెల్లవారుజామున నగరంలో రెండు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఏటీఎం దొంగలు దొంగతనాలకు పాల్పడిన రూ.42లక్షలు ఉడ్చుకేళ్లారు. అంతే కాకుండా అనవాళ్లు దొరక కుడదని నిప్పు పెట్టిన విషయం విధితమే. అ కేసు కొలిక్కి రాకముందే నగరంలో మరోసారి ఎటిఎంలో చోరియత్నం కలకలం రేపుతోంది.