నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం, ఇన్ఫోసిస్, టాస్క్ సహకారంతో మార్చి 10, 11 తేదీలలో ఏఐ యుగంలో విద్య అనే అంశంపై రెండు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ అతిక్ సుల్తాన్ గోరీ తెలిపారు. శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి తో కలిసి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన, వినియోగాలలో ఏఐ ప్రాముఖ్యత, ఆధునిక విద్యా విధానంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, సవాళ్లు, అవరోధాలు, పరిష్కారాలు ఈ శిక్షణా కార్యక్రమంలో చర్చించబడతాయని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల సిబ్బంది ఈ నెల 9 వ తేది లోపు గూగుల్ ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు https://forms.gle/jkKrX8nn4tRE2WSp6 లింక్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.