Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2025, 3:56 pm Posted by : ramakrishna

కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలి

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు పెద్దోడ్ల నర్సింలు  నూతనంగా నిర్మాణం చేస్తున్న ఇంటిని కక్షపూరితంగా, ఇంటి కి సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు  సరిగ్గా ఉన్నప్పటికీ వాటిని అలాగే అధికారులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  ఆధీనంలో ఉంచుకొని ఆయనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి తన స్లాబ్ ను కూల్చివేయడం జరిగిందని ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్, స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ మర్రి బాలకిషన్, జిల్లా నాయకులు రవీందర్ రావు, లింగారావు, వివిధ మండలాల  అధ్యక్షులు ఎల్లారెడ్డి మండల పార్టీ కార్యకర్తలు పదాధికారులందరు వెళ్లి తనకు సంఘీభావం తెలిపి కార్యకర్తకు అండగా పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని న్యాయపరమైన పోరాటానికి పార్టీ అండగా నిలుస్తుందని నర్సింలు కు  ధైర్యం చెప్పడం జరిగింది, అనంతరం వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి పార్లమెంట్ సభ్యులు ఆర్థిక సహాయం చేసి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందాని అనంతరం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు అందరూ మీడియా మిత్రులతో తదుపరి ప్రణాళిక గురించి అలాగే కార్యకర్తలను ఉద్దేశించి ఈ నియోజకవర్గ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకి హెచ్చరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడద్దని నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఇతర పార్టీల నాయకుల వల్ల నష్టం జరగకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు అండగా ఉంటారని కార్యకర్తలకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.

Factional politics should be avoided