Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 8:37 pm Posted by : ramakrishna

29న నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో కంటి వైద్య శిబిరం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి స్వామిదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి వైద్య నిపుణులు అయిన ప్రముఖ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. నూతన సాంకేతిక పనిముట్లతో కంటి పరీక్షలు కొనసాగుతాయని స్వామిదాస్ తెలిపారు.