Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 9:02 pm Posted by : ramakrishna

గాంధారిలో పోలీసు అధికారులు, డ్రైవర్లకు నేత్ర పరీక్ష శిబిరం

 

. . . 311 మందికి పరీక్షలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, డ్రైవర్ల కోసం గురువారం ప్రత్యేక నేత్ర పరీక్ష శిబిరం నిర్వహించారు. రోడ్డు భద్రత, డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్, ఎస్‌పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఉత్నూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కుమార్, గాంధారి ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ఇస్తియానత్ అలీ, ఆప్తాల్మిక్ ఆఫీసర్ బి. హరికిషన్ రావు, బోధన్ లయన్స్ క్లబ్ మొబైల్ ఐ స్క్రీనింగ్ బృందం, ఆర్‌బీఎస్‌కే ఎంహెచ్‌టీ గాంధారి సిబ్బంది పాల్గొన్నారు.

 

Eye check-up camp for police officers and drivers in Gandhari

 

శిబిరంలో మొత్తం 311 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. అందులో 32 మందిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఐఓఎల్ శస్త్రచికిత్స కోసం రిఫర్ చేశారు. 42 మందికి కళ్లద్దాలు సూచించారు. అలాగే 4 మందిని హైదరాబాద్ సరోజినీదేవి నేత్ర ఆసుపత్రికి ప్రత్యేక చికిత్స కోసం పంపించారు.