ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్ష శిబిరం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. బాన్స్ వాడ లోని లయన్స్ ఐ హాస్పిటల్ సహకారంతో గురువారం నిర్వహించిన కంటి పరీక్ష శిబిరంలో మొత్తం 48 మంది రోగులను పరీక్షించారు. ఈ శిబిరంలో 6 మంది రోగులను ఐఓఎల్ శస్త్రచికిత్స కోసం బాన్స్ వాడ లయన్స్ ఐ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అలాగే 23 మందికి కళ్లద్దాలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి...