- టీ.యు.సీ.ఐ. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కె. రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : బీడీ కార్మికుల వద్ద వెయ్యి బీడీలకు అదనంగా రూ.10 వసూలు చేసే పద్ధతికి, బలవంతంగా తినుబండారాలను అంటగట్టే వ్యాపారానికి నిర్వాహకులు వెంటనే స్వస్తి పలకాలని టీ. యు. సీ. ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కే.రాజేశ్వర్ హెచ్చరించారు. బుధవారం దేశాయ్ బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం చేస్తూ నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమ.. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చట్ట విరుద్ధంగా దేశాయి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం 1000 బీడీలకు పది రూపాయలు తక్కువ ఇవ్వడము (చట్టానికి దొరకకుండా) నిలువు దోపిడీ అవుతుందని తీవ్రంగా విమర్శించారు… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముడి సరుకు తుట్టిని (ఆకు తక్కువ పడితే కొనుగోలు చేసి బీడీలు ఇవ్వాలి.) కార్మికులు ఇవ్వాలన్నారు. బీడీ యజమాన్యం తినుబండారాలైన కురుకురే, దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు, కారా పాకెట్లు తప్పనిసరి కొనుగోలు చేసే విధంగా బలవంతంగా అంటకట్టే పద్ధతి సమంజసం కాదని ఈ పద్ధతి గత పది సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. తద్వారా కోట్లాది రూపాయలు కార్మికులకు నష్టం చేస్తున్నారని అన్నారు. అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల నష్టపరిచే ఈ పద్ధతుల్ని మానుకోవాలని కోరిన ఫలితం లేకుండా పోయిందన్నారు. 16 అక్టోబర్ రోజున రేంజ్ ఆఫీసుకు వెళ్లి డిమాండ్ చేస్తామన్నారు. దీనికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోదేశాయి బీడీ కార్మికులు లావణ్య స్వప్న . రాజమణి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.