ధాన్యం సేకరణ కోసం విరివిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ.శరత్ కలెక్టర్ తో కలిసి చంద్రాయణపల్లి కొనుగోలు కేంద్రం తనిఖీ ఇంటింటి సర్వే, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిజామాబాద్, బతుకమ్మ : ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ ఏ.శరత్ తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్,...