Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 2:13 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై పోలీసుల విస్తృత తనిఖీలు

బతుకమ్మ, భిక్కనూరు: ఇటీవల కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అర్ధరాత్రి టోల్ ప్లాజా లో విస్తృత తనిఖీలు చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ఎన్ హెచ్  44 హైవే వద్ద ఉన్న టోల్ ప్లాజాలో గురువారం రాత్రి 11గం  నుంచి ఉదయం ఆరు గంటల వరకు రోడ్డు ఇరువైపులా ప్రతి ఒక్క వాహనం తనిఖీ నిర్వహించారు. సిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ తనిఖీలలో 27 కేసులు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Extensive police checks on national highways