ఆహార కల్తీ నివారణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఈ దిశగా కల్తీ ఆహార పదార్థాలను నివారించేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ఆహార కల్తీ నిరోధక శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్, టిఫిన్ సెంటర్స్, ఆహార పదార్థాల విక్రయశాలలు, దుకాణాలు...