రాజన్న సిరిసిల్ల జిల్లాలో రవాణా శాఖ విస్తృత తనిఖీలు..
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తా, వేములవాడ, కోడూరుపాక ప్రాంతాల్లో మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా సరుకు రవాణా వాహనాల్లో అక్రమంగా ప్రయాణికులను తరలిస్తున్న నాలుగు వాహనాలను సీజ్ చేశారు. అలాగే పర్మిట్ లేని లారీలు, ఫిట్‌నెస్ లేని ట్రాక్టర్లు, నిబంధనలు ఉల్లంఘించిన...