తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు....