ప్రజా పాలన దినోత్సవ వేడుకకు విస్తృత ఏర్పాట్లు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య...