Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 5:02 pm Posted by : ramakrishna

ప్రజా పాలన దినోత్సవ వేడుకకు విస్తృత ఏర్పాట్లు

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య అతిథితో పాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని అన్నారు. వేదిక, సిటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Extensive arrangements for Public Governance Day celebration