Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 6:27 pm Posted by : ramakrishna

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ మూడో తేదీ వరకు ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం పొడిగించిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి  తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని గురుకుల జూనియర్ కళాశాలలలో ప్రిన్సిపాల్ లు విద్యార్థులు అందరితో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ మూడో తేదీ వరకు ఫీజు చెల్లింపజేయాలని తెలియజేశారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని, 500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 11వ తేదీ నుండి డిసెంబర్ 17వ తేదీ వరకు చెల్లించవచ్చని, అలాగే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.