Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:14 pm Posted by : ramakrishna

పరీక్ష ఫీజుల తేదీలను పొడగించండి

 

. . . గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ కి పీడీఎస్ యూ నాయకుల వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పరీక్ష రుసుము అపరాధ రుసుము లేకుండా వారం రోజులపాటు పొడిగించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి కి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ నగర ప్రధాన కార్యదర్శి ఆర్. వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు మాత్రమే అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని  తెలపడం దుర్మార్గమన్నారు. ఎందుకంటే 10వ తేదీన వెలువడిన నోటిఫికేషన్ విద్యార్థులకు చేరువయ్యె లోపు ఒకరోజు సమయాన్ని తీసుకుంటుందని, మిగిలిన రెండు రోజులలో ఏ విధంగా విద్యార్థులు పరీక్ష రుసుమును చెల్లిస్తారని ప్రశ్నించారు. ఖచ్చితంగా వారం రోజుల పాటు అపరాధ రుసుము లేకుండా పరీక్ష రుసుము చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ ని కోరారు. ఎలక్షన్ కారణంగా ఇప్పటికే లేట్ అయిందని ప్రిన్సిపల్ చెప్పడం, విద్యార్థుల మీద భారం మోపడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ కళాశాల నాయకులు ఎస్ప్రీత్, కరణ్, రాహుల్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.