Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 1:32 pm Posted by : ramakrishna

బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయవరం సమీపంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ఆరుగురు మరణించారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్య లు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.