Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 4:42 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి డివిజన్ లో అర్టిజన్ కార్మీకుల శ్రమ దోపిడి

ఎల్లారెడ్డి డివిజన్  కార్యలయం వద్ధ నిరసన

. . . అధికారులకు వినతి పత్రం అందించిన యూనియన్

 ఎల్లారెడ్డి, బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో విద్యుత్ శాఖలో పని చేస్తున్న అర్టిజన్ కార్మీకులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. స్టాండింగ్ అర్డర్ ప్రకారం ప్రతిరోజు 8 గంటలు పని ప్రకారం 240 గంటలు పని చేయాల్సిన చోట ఎక్కువ పని దినాలు చేయిస్తున్నారు. హెచ్ బి 2 యూనియన్ అధ్వర్యంలో అర్టిజన్ కార్మీకులు సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ కార్యలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సంధర్బంగా అధికారులకు  టిజి ఎన్ పిడిసిఎస్ కంపేని ప్రెసిడేంట్ శ్రీకాంత్, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, డివిజన్ కార్యదర్శి రాజాగౌడ్ లు  అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లడుతు…. ఎల్లారెడ్డి డివిజన్ లో అర్టిజన్ కార్మీకులు స్టాండింగ్ అర్డర్ కంటే ఎక్కువ పని దినాలు చేయిస్తున్నారన్నారు. అధనంగా పని దినాలు పని చేసిన కోందరు అధికారులు తమ వేతనాలలో కోతలు విదిస్తు కార్మీకులకు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కోన్నారు. ఈ విషయంలో యూనియన్ తరుపున  8 గంటల షిప్టు ప్రకారం పనికోసం అధికారులకు విన్నవించి అమలు చేయాలని కోరారు.

 

Exploitation of artisan labor in Ellareddy Division