. . . డిపేన్స్ మద్యం సీసాలు సీజ్
. . . ఇద్దరి ని అరెస్ట్ చేసిన ఆబ్కారీ శాఖ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో అనుమతులు లేకుండా ఇండ్లలో విదేశీ మద్యం, ఆర్మీ కి సంబంధించిన మద్యం ను నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నగరంలోని న్యాల్ కల్ రోడ్డులోని కంకనాల గంగారత్నం, ముబారక్ నగర్ లోని ముడ భాస్కర్ ఇండ్లలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇద్దరి వద్ద నుంచి ఖరీదైన విదేశీ మద్యం, డిపేన్స్ మద్యం 110 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత మద్యంను విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద, ఆర్మీ లో పనిచేసే వారి దగ్గర కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐలు ఎండి నజీర్ హుస్సేన్, బి గజేంధర్, ఎస్ఐ రవి తో పాటు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఎం సరిత, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఖరీదైన విదేశీ , డిపేన్స్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.