Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 6:11 pm Posted by : ramakrishna

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ల సంఘం కార్యవర్గం

బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సంఘం కార్యవర్గంను శు్క్రవారం ఎన్నుకున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు  చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులుగా ఐలాపూర్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య, ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజు, ప్రధాన కార్యదర్శిగా డిచ్పల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  చంద్ర విట్టల్, సంయుక్త కార్యదర్శిగా మోర్తాడ్ జూనియర్ కళాశాల ప్రిన్సపాల్  బి.గంగాధర్, కోశాధికారిగా నిజామాబాద్ బాలుర(ఖిల్లా) కళాశాల ప్రిన్సిపల్  ఎం.ఏ.కాలిక్, మహిళా ప్రతినిధిగా ఆర్మూర్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్, కార్యవర్గ సభ్యులుగా బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  నిఖత్ కౌసర్, మాక్లూరు కళాశాల ప్రిన్సిపాల్  గంగారాం లు ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికల అధికారిగా భీమ్ గల్ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి వ్యవహరించారు.