న్యాయవాదుల విధుల బహిష్కరణ
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాద దంపతులపై పోలీసుల భౌతిక దాడిని నిరసిస్తూ నిజామాబాద్ న్యాయవాదులు విధుల బహిష్కరించారు. గురువారం కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమాలకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. కక్షిదారుల ప్రయోజనాలే పరమావధిగా న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని ఆయన అన్నారు.వ్యక్తిగత పనికోసం కాకుండా చట్టబద్ధమైన పనికోసమే వెళ్లినవారిపైన అధికారిక విధులలో ఉన్న పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం...