Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 6:29 pm Posted by : ramakrishna

న్యాయవాదుల విధుల బహిష్కరణ

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాద దంపతులపై పోలీసుల భౌతిక దాడిని నిరసిస్తూ నిజామాబాద్ న్యాయవాదులు విధుల బహిష్కరించారు. గురువారం కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమాలకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ తెలిపారు.

కక్షిదారుల ప్రయోజనాలే పరమావధిగా న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని ఆయన అన్నారు.వ్యక్తిగత పనికోసం కాకుండా చట్టబద్ధమైన పనికోసమే వెళ్లినవారిపైన అధికారిక విధులలో ఉన్న పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం నేరమని జగన్ పేర్కొన్నారు.న్యాయవాద రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థల ద్వారా తయారీ చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లని ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయని బాద్యులైన పోలీసు అధికారులను సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

చట్టబద్ధంగా ఉండాల్సిన పోలీసులే చట్టవ్యతిరేకమైన చర్యలకు దిగడం సహించరానిదని రెడ్డి ఆక్షేపించారు. సమావేశానంతరం జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు జనగామ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు దొంపల్ సురేష్ అందెల దీపక్,కుమార్ దాసు అల్గొట్ రవీందర్ ,భాను చందర్, విశ్వక్ సేన్ రాజ్,సామెల్,నూరోద్దీన్, విఘ్నేష్ నూర్జహాన్,జోరీగ సుదర్శన్,మానిక్ రాజు,శ్రీనివాస్, రవి ప్రసాద్ పుణ్యరాజ్ సాయిలు నరేష్ బలలాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Exclusion of duties of advocates