కల్లుబట్టి వ్యవహారంలో ఎక్సైజ్ ఎస్ హెచ్ వో బదిలీ
అధికారుల ఆదేశాలను అమలు చేయడమే కారణమా? ఇందూర్ కల్లు రాజకీయాలకే ఎస్ హెచ్ వో బలి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుకు బదిలీ చేసినా ఎస్ హెచ్ వో నియామకమేది? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు (కృత్రిమ) మాఫియాకు ఎస్ హెచ్ వో బలి అయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు తయారి కుటీర పరిశ్రమ నుంచి పరిశ్రమ స్థాయికి ఎదిగిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్ బాధితుల జిల్లాగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు...