Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 2:20 pm Posted by : ramakrishna

రెండు తాండాల్లో ఎక్సైజ్ దాడులు

 

. . . 11 లీటర్ల గుడుంబా స్వాధీనం

. . . నాటు సారా తయారికి వినియోగించే బెల్లం పాకం పారబోత

. . . నలుగురు అరెస్ట్

 భీంగల్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్పల మౌతున్నాయి. గ్రామాల్లో, తాండాలలో గుడుంబా, నాటుసారా తయారి విచ్చల విడిగా సాగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, డిటిఎఫ్ అధికారులు భీంగల్ మండలం కారేపల్లి తాండా, దేవునిపల్లి తాండాలలో దాడులు నిర్వహించారు.

Excise raids in two thandas

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్, డి టి ఎఫ్ సి ఐ విలాస్ ల సంయుక్త ఆధ్వర్యంలో రెండు తాండాలలో ఇండ్లలో, శివారు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో 11 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారికి వినియోగించే 150 బెల్లం పానకం పట్టుకుని పారబోశారు.గుడుంబా నాటు సారా తయారు చేస్తున్న నలుగురి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Excise raids in two thandas