మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మద్యం దుకాణాల్లో, బెల్టు షాపులలో గురువారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు మద్యం షాపుల్లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులున్నారు.