Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 1:38 pm Posted by : ramakrishna

బాన్సువాడలో ఎక్సైజ్‌ కార్యాలయం ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ సురేశ్ శెట్కర్‌, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా ఎక్సైజ్‌ అధికారులు సోమిరెడ్డి, హనుమంతరావు, సీఐ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ఘన స్వాగతం..

ఎక్సైజ్ నూతన కార్యాలయ భవన ప్రారంభం, అమృత్ 2.0 తాగునీటి సరఫరా పనుల శంకుస్థాపనకు వచ్చిన మంత్రి  జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేశ్ షెట్కార్ కు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో వారు సమావేశమయ్యారు.

Excise office opened at Bansuwada