రామారెడ్డిలో అక్రమ నాటుసారా తయారీపై ఎక్సైజ్ శాఖ దాడులు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోశెట్టి ఆధ్వర్యంలో గురువారం ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలిసి రామారెడ్డి మండలంలోని కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కన్నాపూర్ తండా, దుబ్బ తండా, స్కూల్ తండా, జగదాంబ తండా, బట్టు తండా తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. తనిఖీల్లో కన్నైగూడెం తండా శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 లీటర్ల...