రుద్రూర్, బతుకమ్మ : వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని రాణంపల్లి క్యాంపు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ ఎండి జలీల్ ఉద్దీన్ మాట్లాడుతూ.. రాణంపల్లి క్యాంపులో సుమారు వేయి ఈత చెట్లను నాటినట్లు ఆయన తెలిపారు. నాటిన ఈత చెట్లకు క్రమం తప్పకుండా నీటిని అందించి, అలాగే ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎం. చంద్రశేఖర్, కానిస్టేబుల్ లు ఎం.శ్రీనివాస్, ఆర్.దీపక్ గౌడ సంఘం నాయకులు డి. గంగాగౌడ్, డి.వెంకాగౌడ్, సుదర్శన్ గౌడ్, గంగారం పటేల్, గాండ్ల ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.