వన మహోత్సవంలో ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సీఐ దిలీప్
బాన్సువాడ, బతుకమ్మ : వనమహోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎక్సైజ్ సీఐ దిలీప్ ముఖ్య అతిథిగా హాజరై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ దిలీప్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని అన్నారు. ముఖ్యంగా ఈత మొక్కలు భూమిలో తేమను కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో కీలక పాత్ర...