Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2024, 12:35 pm Posted by : ramakrishna

 గంజాయి విక్రయిస్తున్న విద్యార్ధులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్

 బతుకమ్మ, నిజామాబాద్ క్రైం:
నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ డైరీ పారం వద్ధ నలుగురుని ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ అధుపులోకి తసుకున్నారు. మంగళవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ పోర్స్ మెంట్ సిఐ వేంకటేష్ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్ధరు విద్యార్ధులు ఉన్నారు. అబ్కారి శాఖవారు అధుపులోకి తీసుకున్న వారిలోని నగరానికి యెందిన యువకులు ఉన్నారు. వారి వద్ధనుంచి గంజాయి రికవరి చేసుకోని గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నారని ఆరా తీస్తున్నారు. గంజాయి విక్రయిస్తు విద్యార్ధులు పట్టుబడటం కలకలం రేపింది. నగరంలో గంజాయి క్రయ విక్రయాల జోరుగా సాగుతున్నాయి అనడానికి విద్యార్ధులు పట్టుబడటమే ఉధహరణగా చెప్పాలి. పూర్తి వివరాలు ఇంకా ఎక్సైజ్ అధికారులు వెల్లడించలేదు.