బతుకమ్మ, ఏర్గట్ల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని డాక్టర్ రక్షిత రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరంలో రక్త పోటు,మధుమేహం, కంటికి సంబంధించిన వ్యాధులకు అలాగే మానసిక హిమోగ్లోబిన్ చర్మవ్యాధి కి సంబంధించిన వారికి డాక్టర్లు తమ సేవలను అందించారు. ప్రత్యేకించి చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులకు పిల్లల వైద్య నిపుణులచే ప్రత్యేక వైద్య పరీక్షలు చేపట్టారు.ప్రత్యేకించి చిన్నపిల్లలకు టీకాలు వేసినప్పుడు తల్లిదండ్రులు డాక్టర్ చెప్పిన సూచనలు తప్పక పాటించాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు రక్షిత రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వివిధ రకాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో గ్రామా కమిటీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గుమ్మిర్యాల మాజీ సర్పంచ్ రాజారెడ్డి,గడ్డం లింగారెడ్డి,ఎంపీడీవో వెంకటేశ్వర్లు,ఎంపీఓ శివ చరణ్, పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్,రాకేష్, ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజ్, దంత వైద్యులు డాక్టర్ ప్రవీణ్, టీబి ఎస్టిఎస్ ఎండి గౌస్ ఉద్దీన్, హెచ్ఐఓ మోతీరాం, పీహెచ్ఎం ఇందిరా, ఆరోగ్య సహాయకులు పండరి, కల్పన, మోహన్, తదితరులు పాల్గొన్నారు.