నిజామాబాద్, బతుకమ్మ :
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి, బోదన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి పర్యవేక్షించారు. నిజామాబాద్ బస్ స్టాండ్ లో ఆర్టి సీ అధికారులతో కలిసి గురువారం ఎసీ బస్సు ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మంత్రి పొన్నంతో పాటు మరి కొంత మంది మంత్రులు అర్టిసీ ఎసీ బస్సు లను ప్రారంభించనున్నారు. మాజీ మంత్రి వెంట ఆర్టిసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తాహేర్ బిన్ హందాన్, నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.