Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 5:33 pm Posted by : ramakrishna

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపాటు

నందిపెట్, బతుకమ్మ : టీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో గురువారం జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయని నేతలు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ, కాంగ్రెస్ నాయకులను దూషించడం క్షమించరాని విషయమని అన్నారు. జీవన్ రెడ్డి గతంలో చేసిన అక్రమాలు, కమిషన్ల లావాదేవీల గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని, ఇకనైనా ఆయన తగిన మార్గంలో నడుచుకోవాలని మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంద మహిపాల్. నాయకులు యూసుఫ్, దేవదాస్ గౌడ, జమీల్, దమ్మాయి శ్రీనివాస్, తిమ్మల పోశెట్టి, బైండ్ల ప్రశాంత్, మన్నే సాగర్ తదితరులు పాల్గొన్నారు.