Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 6:49 pm Posted by : ramakrishna

తప్పుడు అఫిడవిట్ ద్వార మాజీ ఎమ్మెల్యే బిగాల మోసం చేశారు

 . . . కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదే ప్రవీణ్ కుమార్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి 2023 లో జరిగిన ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్లను సమర్పించి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రజలను, ఎలక్షన్ కమిషన్ ను మోసం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదే ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ… ఎలక్షన్ లో పోటీ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు పత్రాలు ఇచ్చారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామం మాక్లూర్ లో 9.16  ఎకరాలను రూ.4 లక్షలకు కొన్నారని అఫిడవిట్ లో పేర్కొన్నారని కాని అక్కడ సంబంధిత భూమి విలువ రూ.2.70 కోట్లని అన్నారు. తప్పుడు అపిడవిట్ సమర్పించిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Ex-MLA Bigala cheated with false affidavit