బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరామర్శ

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్,కమ్మర్పల్లి,మోర్తాడ్ మండలం లో పలువురి భాధిత ఆత్మీయ కుటుంబాలను మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరమర్శించారు. ఇందులో భాగంగా భీంగల్ మండలంలోని బడా భీంగల్ పిట్ల దాస్  కాలం చేయడంతో వారి కుటుంబాన్ని,భీమ్ గల్ పట్టణ కేంద్రానికి చెందిన ముస్తాక్ (రిటైర్డ్ పోస్టుమాన్) కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను,పురానిపెట్ గ్రామానికి చెందిన బీయర్ఎస్ నాయకులు నరేందర్ వాళ్ళ అమ్మ కాలం చేయడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కమ్మర్పల్లి మండలంలోని చౌటపల్లి కి చెందిన గుండ్ల...