భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్,కమ్మర్పల్లి,మోర్తాడ్ మండలం లో పలువురి భాధిత ఆత్మీయ కుటుంబాలను మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరమర్శించారు. ఇందులో భాగంగా భీంగల్ మండలంలోని బడా భీంగల్ పిట్ల దాస్ కాలం చేయడంతో వారి కుటుంబాన్ని,భీమ్ గల్ పట్టణ కేంద్రానికి చెందిన ముస్తాక్ (రిటైర్డ్ పోస్టుమాన్) కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను,పురానిపెట్ గ్రామానికి చెందిన బీయర్ఎస్ నాయకులు నరేందర్ వాళ్ళ అమ్మ కాలం చేయడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కమ్మర్పల్లి మండలంలోని చౌటపల్లి కి చెందిన గుండ్ల (కత్తి )మల్లేష్ వాళ్ళ అమ్మ కాలం చేయడంతో వారిని పరామర్శించి వారి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.అదే గ్రామానికి చెందిన మారు నర్సయ్య సీనియర్ నాయకుని అమ్మ కాలం

చేయడంతో వారి కుటుంబాన్ని, కమ్మర్పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ వాళ్ళ అమ్మ కాలం చేయడంతో వారిని పరామర్శించారు.కొనసముందర్ గ్రామానికి చెందిన బీయర్ ఎస్ సీనియర్ నాయకులు లింబాద్రి కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన గోలి బార్ నర్సయ్య తెలంగాణ ఉద్యమ కారుడు కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను,శ్రీకాంత్ ఎక్స్ ఎంపీటీసీ కూతురు జన్మించి అనారోగ్యానికి గురి అయ్యి చికిత్స అనంతరం ఇంటికి రావడంతో వారిని ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు.
