Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2025, 8:28 pm Posted by : ramakrishna

అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి

  • ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ డబ్ల్యూ ఎస్ ను అన్ని రంగాల్లో అమలు చేయాలని ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. అగ్రవర్ణాల పేదల బతుకులు మారేదెప్పుడు, ప్రభుత్వాలు మారిన మా అగ్రవర్ణ పేదల బతుకులు మారలేదన్నారు. పేరుకే గొప్పగా పిలవబడే జాతులు అగ్రవర్ణ ప్రజలు. మా పరిస్థితి రోజు రోజు కి అన్ని రకాలుగా దిగజారిపోతోందని తెలిపారు. అన్యాయం  అయిపోతున్న బతుకులు మావి..  ఈ రోజుల్లో మా అగ్రవర్ణాల ప్రజలకి అడుగడుగున అవమానాలు అన్యాయాలు తప్ప మాకు ఓరిగింది ఏమి లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ లేక ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక మా యువతి యువకులు బతుకులు ఆగం అవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కూడా రాష్ట్ర లో పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ రంగ ఉద్యగాలలో రిజర్వేషన్ ను పాటించటం లేదన్నారు. కింది స్థాయిలో కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం లో చాలా జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో దేశంలో అగ్రవర్ణాలు ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసి సంఘం నాయకులు, బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ కొలవి అనిల్ కుమార్, అశోక్, కోవూరి జగన్, ఆర్ యుగంధర్, జోషి క్రాంతి కుమార్ లు పాల్గొన్నారు.