అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించాల్సిందే
బాసర ట్రిపుల్ ఐటీలో బీసీ విద్యార్థులకు అన్యాయం తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అగ్రవర్ణాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లను వెంటనే రద్దు చేసి, ఆ కోటాను బీసీలకు వర్తింపజేయాలని తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు....