ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బలహీన వర్గాలకు అన్యాయం

నిజామాబాద్, బతుకమ్మ : బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల కేటాయింపులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ సీట్ల ఎంపికలో అన్ని వర్గాలతో పోలిస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరికి అత్యల్ప కటాఫ్   మార్కులు ఉండటం ఏంటని నరాల సుధాకర్ ప్రశ్నించారు. అదే మార్కులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు సీట్లు ఎందుకు రాలేదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో  ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు...