Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 7:33 pm Posted by : ramakrishna

 రేపటి రెండో విడత పోలింగ్ కు అంతా సిద్ధం

. . . వంద శాతం పోలింగ్ జరగాలి

. . .  కామారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉదయం  మాక్ పోల్ అనంతరం ఉదయం 7.00 గంటల నుండి  మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్ ముందుగా లింగంపేట మండలం, ఎల్లారెడ్డి మండలం, నిజాంసాగర్ మండలం లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే తమకు కేటాయించిన కేంద్రాలకు సకాలం లో చేరుకొని ఎన్నికల సామాగ్రి నీ ఒకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉండాలని,ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 1.00 గంటకు ముగించాలన్నారు. పోలింగ్ ఖచ్చితంగా  వంద శాతం జరగాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కొరకు అన్ని సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శీతాకాలం దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగిందని తెలిపారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, బస్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్ డి ఓ పార్థ నరసింహా రెడ్డి ఎన్నికల అధికారులు, తదితరులు ఉన్నారు.

Everything is ready for tomorrow's second phase of polling