Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 4:37 pm Posted by : ramakrishna

పది పరీక్షలకు సర్వం సిద్ధం

మండల విద్యాశాఖాధికారి నాగయ్య 

 

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని మండల విద్యాశాఖాధికారి నాగయ్య తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఉమ్మడి బోధన్ మండలంలో మొత్తం 2984 విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని, వీరి కొరకు 13 పరీక్ష కేంద్రాలను పట్టణంలో 10, మండలాల్లో 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 13 మంది చీఫ్ సూపర్డెంట్లు, 13 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 7 గురిచే అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5గురిచే ఫ్లయింగ్ స్క్వాట్స్, 140 పైచిలుకు ఎగ్జామ్ ఇన్విజిలేటర్లు నియమింపబడడం జరిగిందని, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని లేని పక్షంలో విద్యార్థులు ఆన్లైన్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని వచ్చిన పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తామని తెలిపారు.