భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ తెలిపారు.
కోడ్ ఉన్న లెక్కలేదు
పల్లెలో నగదు మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్ ఎస్ టీం ,ఎస్ ఎస్ టీం బృందాలను నియమించింది. వీటికి తోడు తనిఖీ కేంద్రాలను ప్రారంభించిన ప్రయోజనం లేకుండా పోయింది. పల్లెలో మద్యం నగదు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఏర్పాట్లు చేసిన అధికారులు
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు ఓటింగ్ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ
మొదటి విడత ఎన్నికల విజయవంతానికి అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్ తెలిపారు. భిక్కనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల అధికారులకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు.