Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 5:00 pm Posted by : ramakrishna

అంతా నా ఇష్టం . . . మాకెవరు అడిగేది ?

 

. . . చెరువులో రాత్రి వేళలో అక్రమంగా మట్టి త్రవ్వకాలు

 

. . . ఓ అధికారిణి అండదండలతో చెలరేగుతున్న మట్టి మాఫియా

 

. . . నిద్ర మత్తులో అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

అంతా నా ఇష్టం.. మాకెవరు అడిగేది?.. అన్న చందంగా మారింది ఓ వ్యక్తి వ్యవహార శైలి. రుద్రూర్ మండల కేంద్రంలో గల చెరువులో పగలు, రాత్రి అనే తేడా లేకుండా సంపాధనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబి సహాయంతో అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లలో తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం రాత్రి రుద్రూర్ గ్రామ చెరువులో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బ తీస్తున్నారు. ఓ అధికారిని అండదండలతో మట్టి మాఫియా చెలరేగుతున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిద్ర మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. చెరువులో అక్రమ మట్టి తవ్వకాల పై ఆర్ ఐ రాజేష్ , డిప్యుటి తహశీల్దార్ సురేందర్ నాయక్ కు చరవాణిలో వివరణ కోరగా చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానమిచ్చారు.

 

Everything is my choice... Who asks us?