- రాంపూర్- కుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి
- సామాజిక ప్రజా వేదికలో వెల్లడి
బతుకమ్మ పిట్లం :జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో చేపట్టిన పనులలో అంతా అవినీతి కనిపించింది. శనివారం పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక ప్రజా వేదిక ఏపీ డి వామన్ రావు సమక్షంలో ప్రజా వేదిక నిర్వహించారు. పిట్లం మండలంలోని 25 గ్రామపంచాయతీలలో సామాజిక బృందం గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి అవినీతిని వెలికి తీశారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో అవినీతి జరిగింది అని వెల్లడించారు. మండలంలోని రాంపూర్ కుర్తి గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు వారి కుటుంబ సభ్యులు పనిచేయకపోయినా పని చేసినట్టు మాస్టర్ లో లెక్కలు రాసి డబ్బులు కాజేసినట్లు వెల్లడించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబ సభ్యులు భార్య, తండ్రి ,తల్లి, వదిన, తమ్ముల పేర్లతో సభ్యులు పని చేయకపోయినా మాస్టర్ కిరోల్లో పనులు చేసినట్టు రాసి డబ్బులు తీసుకున్నట్లు గ్రామంలో గ్రామ సభలో ప్రజలు సామాజిక తనిఖీ బృందానికి తెలిపినట్లు తెలిపారు . ఏపీడి వామన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీవో మహేష్ ను వారి నుండి రికవరీ చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో జరిగిన అవినీతిని వెలికి తీసిన బృందానికి అభినందించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ల డబ్బులు రికవరీ చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ సాయి రెడ్డి, చిన్న కోడప్ గల్ సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి, ఎంపీడీవో కమలాకర్, ఏపీవోలు మహేష్, శివకుమార్, ఆయా గ్రామాల కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు,టెక్నికల్ అసిస్టెంట్లు, సామాజిక బృందం పాల్గొన్నారు.